దిగ్విజయ్ తో ఉపముఖ్యమంత్రి భేటీ
ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. కొద్ది రోజుల్లో కేంద్ర కేబినెట్ ముందుకు విభజనపై జీవోఎం రూపొందించిన నివేదిక వెళ్లనుండటం, అనంతరం ఐదు నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు రానుండటంపై మాట్లాడుతున్నట్లు సమాచారం.